కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు! - swimming man died in Karnataka Kalaburagi
కర్ణాటక కలబుర్గిలో ఓ యువకుడు ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ఈత కొట్టేందుకు కొలనులోకి దూకిన 22 ఏళ్ల జాఫర్ అయూబ్.. స్నేహితుల కళ్లముందే శవమయ్యాడు. బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. సరదాగా అలా చేస్తున్నాడేమో అనుకుని స్నేహితులు.. ఫోన్లో వీడియో తీశారే తప్ప కాపాడటానికి ప్రయత్నించలేదు. ఈత కొట్టే సమయంలో తలకు బలమైన గాయం కావడమే ఇందుకు కారణమని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Last Updated : Nov 16, 2019, 2:34 PM IST