వావ్.. కాఫీ మిశ్రమంతో కంబళ వీరుడి చిత్రపటం - కంబళ శ్రీనివాస్ ఆర్ట్
కర్ణాటక మంగళూరుకు చెందిన శ్రావణ్ పూజారీ అనే యువకుడు కంబళ వీరుడు శ్రీనివాస గౌడ చిత్రాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. నీటిలో కలిపిన కాఫీ మిశ్రమంతో కంబళ వీరుడు చిత్రాన్ని గీశాడు. మెుదట పెన్సీల్‌తో శ్రీనివాస గౌడ చిత్రాన్ని వేసిన శ్రావణ్.. తర్వాత నీటిలో కలిపిన కాఫీ పొడి మిశ్రమాన్ని రంగులుగా అద్దాడు. ఇటీవల కంబళ పోటీల్లో100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో చేరుకొని శ్రీనివాస గౌడ రికార్డు నెలకొల్పాడు.