అమర జవాన్ ప్రశాంత్ శర్మకు ఘన నివాళి - UP govt announced Rs 50 lakh ex-gratia and a Job for Prashant
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఎన్కౌంటర్లో అమరుడైన జవాన్ ప్రశాంత్ శర్మకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘన నివాళులు అర్పించారు అక్కడి ప్రజలు. భారీ ఎత్తున తరలివచ్చిన జనం.. ముజఫర్‌నగర్‌లోని ఆయన స్వస్థలంలో జాతీయజెండాలు చేతబూని సంతాపం తెలిపారు. ప్రశాంత్ శర్మ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది యూపీ సర్కార్.