వామ్మో.. 16 అడుగుల కింగ్ కోబ్రా! - kerala kingkobra
కేరళ ఎర్నాకుళం జిల్లాలో 16 అడుగుల కింగ్కోబ్రాను పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. వడత్తుపరలోని ఓ ఇంటి పెరడులో ఉన్న చింతచెట్టుపైన దర్శనమిచ్చింది తాచుపాము. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పాములు పట్టేవాడితో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. సుమారు 20 గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు విషనాగును పట్టుకోగలిగారు. అనంతరం కారింబని అడవుల్లో పామును విడిచిపెట్టారు అధికారులు.