వైద్యం విషయంలో గొడవ- ట్రక్కుతో ఆస్పత్రిపై దాడి - గురుగ్రామ్‌లోని బాలాజీ ఆసుపత్రి
ఓ వ్యక్తి తన పిక్ అప్ ట్రక్కుతో హరియాణా గురుగ్రామ్ బసాయ్ చౌక్‌లోని బాలాజీ ఆసుపత్రిపై దాడికి దిగాడు. ఇద్దరు వృద్ధులకు చికిత్స అందించే విషయంలో కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి సిబ్బందికి గొడవ జరిగిన విషయంలో ఆగ్రహానికి గురయ్యాడు. తన వాహనంతో మందుల దుకాణంలోకి దూసుకెళ్లడం.. సీసీటీవీలో రికార్డు అయింది. ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.