తెలంగాణ

telangana

ETV Bharat / videos

దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ! - రాజధాని

By

Published : Aug 21, 2019, 12:34 PM IST

Updated : Sep 27, 2019, 6:30 PM IST

దిల్లీ ప్రేమ్​నగర్​కు చెందిన బస్సు డ్రైవర్​ అనుజ్​ రాత్రి 9 గంటలకు వాహనాన్ని పార్కింగ్​ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అంతే.. అదనుచూసిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా అతనిమీద పడ్డారు. గొంతును అదిమిపట్టి డ్రైవర్​ నుంచి చరవాణి, 10 వేల రూపాయలు.. ఇతరత్రా వస్తువులు తస్కరించి పరారయ్యారు. సీసీటీవీలో నమోదైన ఈ దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అనుజ్​ చాలా సేపటి వరకు అపస్మారక స్థితిలోనే పడిఉన్నాడు. ఆ దారిగుండా కొందరు వెళ్లినప్పటికీ ఆ బాధితుడ్ని పట్టించుకున్నవారే లేరు. దేశ రాజధానిలోనే కనీస భద్రత లేకుంటే.. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Last Updated : Sep 27, 2019, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details