ఎన్సీపీ మహిళా నేతపై భాజపా ఎమ్మెల్యే దాడి - భాజపా దాడి
గుజరాత్లోని నరోదా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే బలరాం తవానీ, ఆయన అనుచరులు.... ఎన్సీపీ మహిళా నేత నీతూ తేజ్వానీపై దాడి చేశారు. స్థానిక సమస్యలను విన్నవించుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ఆమెను శాసనసభ్యుడు కాలితో తన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నీతూ తేజ్వానీ. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.