మందుల షాపు యజమానిపై భాజపా నేత దాడి
బిహార్లోని బెట్టయాలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్ మాజీ మంత్రి రేణుదేవి సోదరుడు పినూ తన అనుచరులతో కలిసి ఓ మందుల షాపు యజమానిపై దాడి చేశారు. కారణం లేకుండానే ఎడాపెడా కొట్టారు. అనంతరం యజమానిని అపహరించారు. నిందితులు వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించారు.