ట్రక్కును ఢీకొట్టిన 'బెస్ట్' బస్- 8 మందికి గాయాలు - బెస్ట్ బస్
మహారాష్ట్ర, ముంబయిలోని దాదర్ టీటీ ప్రాంతంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'బెస్ట్' బస్ వేగంగా వచ్చి డంపర్‌ను ఢీకొట్టింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని.. అందులో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.