కాశీలో అంగరంగ వైభవంగా 'అతిరుద్ర యాగం' - గంగా నదీ తీరాన శివానీ ఘట్ నందు
కాశీలో జరుగుతున్న 'అతిరుద్ర యాగానికి' భక్త జనం పోటెత్తుతున్నారు. శివానీ ఘాట్ వద్ద జరుగుతున్న ఈ యాగంలో పాలుపంచుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది కాశీకి తరలివస్తున్నారు. ఈనెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం 24వ తేదీన ముగియనుంది.