లారీలో మంటలు- లక్షల విలువైన సరకు దగ్ధం - నాందేడ్-అకోలా రహదారిపై వెళ్లే ట్రక్కులో చెలరేగిన మంటలు
మహారాష్ట్ర హింగోలిలో వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్కులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నాందేడ్-అకోలా రహదారిపై ఈ ఘటన జరిగింది. వాహనం నుంచి వెలువడిన మంటలతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీని రోడ్డు పక్కన ఆపేశాడు. మంటలను ఆర్పేందుకు స్థానికుల సాయం కోరాడు. అయితే.. సమీపంలో ఎక్కడా నీరు అందుబాటులో లేకపోవటంతో వాహనంలోని సరకులతో పాటు ట్రక్కు కాలి బూడిదైంది. దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు డ్రైవర్ తెలిపాడు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
Last Updated : Apr 11, 2021, 11:47 AM IST