డ్రైవింగ్ మాత్రమే కాదు 'ఓటు' వేయడం కూడా డ్యూటీనే! - ఓటు హక్కు వినియోగించుకున్న బస్ డ్రైవర్
TN Local body election 2022: తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉంటూనే ఓటువేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ధర్మపురి జిల్లాలోని బొమ్మిడి ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు శ్రీ విజయలక్ష్మి ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా పాలక్కాడ్ నుంచి సేలంకు బస్సులో ప్రయాణికులను తీసుకెళుతున్నాడు. సరిగ్గా తన సొంత ఊరు బొమ్మిడికి రాగానే రోడ్డు పక్కనే బస్సు ఆపిన శ్రీధర్ ఓటు వేసి పది నిమిషాల్లో వస్తానని ప్రయాణికలకు విజ్ఞప్తి చేశాడు. వారు అందుకు అంగీకరించారు. పరిగెత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన డ్రైవర్ ఓటు వేసి వచ్చి మళ్లీ బస్సు నడిపాడు. డ్రైవర్‌ను ప్రయాణికులందరూ అభినందించారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST