తెలంగాణ

telangana

ETV Bharat / t20-world-cup-2022

దక్షిణాఫ్రికాతో మ్యాచ్​.. అదొక్కటి అధిగమిస్తే టీమ్​ఇండియాకు తిరుగుండదంతే! - T20 worldcup latest news

T20 World Cup: రెండు మ్యాచ్​లు గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా.. ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే రోహిత్ సేన ఈ మ్యాచ్​ గెలవాలంటే రోహిత్​తో పాటు వాళ్లు రాణిస్తే.. సెమీస్​కు మార్గం సుగమవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

india match aginst south africa   t20 world cup 2022 preview
india match aginst south africa t20 world cup 2022 preview

By

Published : Oct 29, 2022, 4:50 PM IST

T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో మరో కీలకపోరుకు టీమ్ఇండియా సిద్ధమైంది. గ్రూప్‌2లో బలమైన జట్టు దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే పాక్‌, నెదర్లాండ్‌పై అద్భుత విజయాలను నమోదు చేసిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గ్రూప్‌2లో అగ్రస్థానం చేరుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ ఆదివారం జరిగే మరో కీలకమ్యాచ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌, నెదర్లాండ్‌ జట్లపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాలు నమోదు చేసిన టీమ్ఇండియా సౌతాఫ్రికాపైనా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్‌2లో సెమీస్‌కు చేరే జట్లను ఈ మ్యాచ్‌ ఫలితం నిర్ణయించనుండటం వల్ల భారత్‌-దక్షిణాఫ్రికా జట్లకు ఈ పోరు ఎంతో కీలకంగా మారింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో గ్రూప్‌2లో భారత్‌ టాప్‌1లో ఉండగా దక్షిణాఫ్రికా ఒక విజయం, మరో డ్రాతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

ఇరుజట్ల బలబలాలను చూస్తే టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఫామ్‌లేమితో బాధపడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నెదర్లాండ్‌పై అర్ధ శతకంతో రాణించడం టీమ్ఇండియాకు కలిసిరానుంది. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం కీలక మ్యాచ్‌లో రాణిస్తే భారత్‌కు తిరుగుండదని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక మిడిలార్డర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ సూపర్‌ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తుండగా, అక్సర్‌ పటేల్‌ అదే రీతిలో జట్టుకు ఉయోగపడాలని టీమిండియా భావిస్తోంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే భారత్‌ చాలాబలంగా కనిపిస్తోంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌ మునుపటి ఫామ్‌ను అందుకోవడం మరో సానుకూలాంశంగా మారింది. ఇంకా మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, రవిచంద్రన్ అశ్విన్‌ రాణిస్తుండటం జట్టుకు కలిసి వచ్చే అంశం కానుంది

దక్షిణాఫ్రికా కూడా అన్నిరంగాల్లో టీమ్ఇండియాకు సమ ఉజ్జీగా కనిపిస్తోంది. జింబాంబ్వేతో జరిగిన తొలిమ్యాచ్‌ వర్షం కారణంగా డ్రా ముగించుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహంతో టీమ్ఇండియాను ఓడించి గ్రూప్‌2 పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరాలని సఫారీ జట్టు భావిస్తోంది.

ఇవీ చదవండి: సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

T20 worldcup: పాక్​ జట్టుపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details