తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రక్తం రకరకాలుగా ఎందుకుంది?

చూడటానికి పైకి ఒకేలా కనిపిస్తుంది గానీ అందరి రక్తం ఒకటి కాదు. ఇందులో ఎ, బి, ఎబి, ఒ అనే రకాలు ఉన్నాయి. అలాగే పాజిటివ్‌, నెగెటివ్‌ను బట్టి కూడా మరిన్ని రకాలుగా వర్గీకరిస్తారు. మరి మన నరనరాన పారే రక్తం గురించి మనకు తెలిని చిన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

why-blood-is-different-in-different-people
రక్తం రకరకాలుగా ఎందుకుంది?

By

Published : Aug 26, 2020, 10:30 AM IST

ఎర్ర రక్తకణాల ఉపరితలం మీదుండే యాంటీజెన్ల ఆధారంగా రక్తం గ్రూపులను నిర్ధరిస్తారు. ఎ యాంటీజెన్‌ ఉంటే ఎ గ్రూపు, బి యాంటీజెన్‌ ఉంటే బి గ్రూపు, ఎ బి రెండూ ఉంటే ఎబి గ్రూపు.. ఇక యాంటీజెన్‌లేవీ లేకపోతే ఒ గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్తకణాల మీద ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటే పాజిటివ్‌గా, లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. ఉదాహరణకు ఎ యాంటీజెన్‌తో పాటు ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటే ఎ పాజిటివ్‌ అని.. ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ లేకపోతే ఎ నెగిటివ్‌ అని అంటారు.

అందరికీ సరిపోయేది..

అత్యవసర సమయాల్లో ఒకే రకం రక్తం అందుబాటులో లేకపోతే ఒ నెగిటివ్‌ రక్తాన్ని ఎక్కిస్తుంటారు. అందుకే వీరిని సార్వత్రిక రక్తదాతలంటారు. ఇక ఎబి పాజిటివ్‌ రక్తం గలవారికి ఎలాంటి గ్రూపు రక్తమైనా సరిపోతుంది. వీరిని సార్వత్రిక రక్త గ్రహీతలంటారు.

ఇదీ చదవండి: కళ్లు మిలమిలా మెరవాలంటే ఇలా చేయాలి!

ABOUT THE AUTHOR

...view details