తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఇవి తింటే.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు!

కుటుంబంలో అందరికీ కావాల్సిన ఆహారం అందిస్తూ.. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండేలా అనుక్షణం తపించే మహిళలు.. తమ ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మహిళల ఆరోగ్యం వారి తీసుకునే పౌష్టికారంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ మహిళలు ఎంలాటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి? మహిళలు తినాల్సిన ఆహారాలేంటి?

health tips for women
మహిళల ఆరోగ్య చిట్కాలు

By

Published : Sep 15, 2021, 4:00 PM IST

చాలా మంది మహిళలు.. పనిలోపడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎంతపని ఒత్తిడిలో ఉన్న వేలకు ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అయితే అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • మహిళలు రోజువారి తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్​, పిండి పదార్థాలు, మినిరల్స్​, విటమిన్స్​ తప్పక ఉండేలా జాగ్రత్త పడాలి.
  • కెరోటినాయిడ్స్‌ ఉండే పదార్థాలను ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్​ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
  • చేపలు: మహిళల ఆరోగ్యానికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఒత్తిడి నుంచి గుండె జబ్బు వరకు అన్నింటిని నివారిస్తాయి.
  • టమోటాలు: ఇందులో 'లైకోపెన్'​.. రొమ్ము క్యాన్సర్​ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఐరన్​ కంటెంట్​ ఉన్న పదార్థాలు: మన దేశంలో ఎక్కువ మంది మహిళలు రక్త హీనతతో బాధ పడుతుంటారు. ఐరన్​ కంటెంట్ లోపమే ఇందుకు కారణం. ఐరన్​ పుష్కలంగా లభించే.. కూరగాయతో పాటు సోయాబీన్స్​.. మాంసాహారం, నట్స్​, కోడిగుడ్లు, జీడిపప్పు, లివర్​, రొయ్యలను ​ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే.. పప్పులు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్​లో​ 30 శాతం అందుతుంది.
  • కాల్షియం లోపం రాకుండా..: కాల్షియం లోపం.. ఎముకల మీద ఆధారపడిన జీవ క్రియలను దెబ్బతీయడం సహా.. పలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. దీన్ని నివారించడాకి పాలు, పాలుతో చేసిన పదార్థాలను తీసుకోవడం మేలు. ఓట్స్ వంటివి బీపీ, మధుమేహం వంటి జబ్బులకు ఔషధంలా పని చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు మరింత మేలు చేస్తాయి.
  • తోటకూర: ఇందులో విటమిన్స్​, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
  • నారింజ, ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details