రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, క్యాన్సర్, గుండెజబ్బు, ఆస్థమా, అల్జీమర్స్.. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఇలాంటి ఎన్నో సమస్యల వెనక దాగున్న కీలక రహస్యం దీర్ఘకాల వాపు (chronic-inflammation) ప్రక్రియ. దీర్ఘకాల జబ్బుల విషయంలో వాపు ప్రక్రియ పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పుడు అవగాహన కూడా బాగానే పెరిగింది. దీన్ని ఎదుర్కోవటమెలా అన్నదానిపై శాస్త్రవేత్తలు కూడా విస్తృతంగానే దృష్టి సారించారు. అయితే అవన్నీ కూడా తిరిగి (chronic-inflammation symptoms) మన ఆహార అలవాట్ల వైపే మొగ్గుచూపుతుండటం విశేషం. మన పేగుల్లోని బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనాలు వాపు ప్రక్రియను ప్రేరేపించటంలో, అణచిపెట్టి ఉంచటంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల దీర్ఘకాల వాపు ప్రక్రియకూ మనం తినే ఆహారానికీ అవినాభావ సంబంధం ఉండటంలో విచిత్రమేమీ లేదు. కాబట్టి వాపు ప్రక్రియను తగ్గించే (chronic-inflammation causes) ఆహార పదార్థాలపై ఓ కన్నేసి ఉంచటం మంచిది.
- పండ్లు, మంచి రంగుతో కూడిన కూరగాయల్లో సహజంగానే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికీ తోడ్పడతాయి.
- గింజపప్పులు, విత్తనాలు తీసుకునేవారిలో వాపు ప్రక్రియ సూచికలతో పాటు గుండెజబ్బు, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
- కాఫీలోని పాలీఫెనాల్స్‌కు, కోకోలోని ఫ్లేవనాయిడ్లకు వాపు ప్రక్రియను తగ్గించే గుణాలు ఉంటున్నట్టు పరిశోధకులు వివరిస్తున్నారు. గ్రీన్ టీలోనూ పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువే.