వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చర్మ సౌందర్యం అంటే.. పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ లేకుండా ఉండటమని అర్థం. 'ముఖం చూసి మనసేంటో చెప్పేయొచ్చు' అనే నానుడి.. సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. అయితే ఆ అందాన్ని ఇంట్లోనే ఉండి.. మన గార్డెన్లో ఉన్న.. బొప్పాయి- కలబందతో తయారు చేసిన పేస్ట్‌తో పొందవచ్చు. పార్లర్లకు వెళ్లి.. రూ.వేలకు వేలు ఖర్చు చేయకుండా.. ఇంట్లోనే.. ఈజీగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. బొప్పాయి- కలబంద పేస్ట్ తయారీ, వినియోగం, ఉపయోగాలు మీకోసం..
కావాల్సిన పదార్థాలు
- పండిన బొప్పాయి పేస్ట్..
- కలబంద పేస్ట్
- తేనె
ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్.. ఒక చెంచా కలబంద పేస్ట్.. ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఈ మూడింటిని కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల.. ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గి.. కాంతివంగా తయారవుతుంది. అలాగే ఈ మిశ్రమాన్ని.. మహిళలు రోజుకో చెంచా తింటే.. వైట్ డిశ్చార్జి సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది.