తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పీరియడ్స్ వాయిదా కోసం ట్యాబ్లెట్లు వాడితే ప్రెగ్నెన్సీకి ఇబ్బందా?

పీరియడ్స్​ను వాయిదా వేయాలని ట్యాబ్లెట్లు వాడుతుంటారు చాలా మంది మహిళలు? కానీ.. అలా చేయడం మంచిదేనా? భవిష్యత్​లో గర్భం దాల్చడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా?

what-happens-if-tablets-used-to-postpone-menstruation
Etv Bharatరుతుక్రమాన్ని వాయిదా వేయడానికి ట్యాబ్లెట్లు వాడితే ఏమవుతుంది

By

Published : Mar 4, 2023, 6:59 AM IST

Updated : Mar 4, 2023, 9:49 AM IST

కాలం విసిరే సవాళ్లను ఛేదించడంలో భాగంగా కొంతమంది ఆడవారు తమకు సాధారణంగా వచ్చే రుతుక్రమాలు (పీరియడ్స్)ను వాయిదా వేసుకుంటూ ఉంటారు. దీని కోసం కొన్ని రకాల హార్మోనల్ ట్యాబ్లెట్లను వాడుతుంటారు. అయితే ఇలాంటి హార్మోనల్ ట్యాబ్లెట్లను వాడటం వల్ల కొన్నిరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

పీరియడ్స్​ను వాయిదా వేయడానికి తరుచుగా హార్మోనల్ ట్యాబ్లెట్లను వాడటం మంచిది కాదు అని ప్రముఖ అబ్‎స్ట్రిషియన్, గైనకాలజిస్ట్ డా. సాహిత్య అంటున్నారు. దీర్ఘకాలం పాటు ఇలాంటి ట్యాబ్లెట్లను వాడటం వల్ల సంతాన సాఫల్యం మీద దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరం సహజంగా ఉత్పత్తి చేసే హార్మోన్ల మోతాదుల్లో మార్పులు కలిగి పిల్లలు కలిగే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.

పీరియడ్స్ విషయంలోనటి అర్చన స్వీయ అనుభవం..
ప్రముఖ టాలీవుడ్​ నటి అర్చన కూడా పీరియడ్స్ విషయంలో తన సొంత అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన పెళ్లి సమయంలో పీరియడ్స్​ను వాయిదా వేసేందుకు మాత్రలు​ వాడానని చెప్పిన ఆమె.. అనంతరం చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ఒక సంవత్సరం పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. చాలా రోజులు చలి జ్వరంతో బాధపడినట్లు తెలిపారు. హార్మోనల్​ ఇన్​బ్యాలెన్స్​తో ఇబ్బంది పడ్డట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈటీవీలో ప్రసారమైన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో భర్త జగదీశ్​తో కలిసి గతంలో పాల్గొన్నారు అర్చన. ఆ పూర్తి వీడియో కోసం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఫర్టిలిటీ మానిటర్​తో..
మరోవైపు.. తొందరగా పిల్లలు కలగాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. అలాంటి ఆశను నెరవేర్చే సాంకేతికను ఫర్టిలిటీ మానిటరీ డిజిటల్ కిట్ కలిగి ఉంది. పిల్లల కోసం తపించే ఎంతోమంది ఆడవారికి ఇది ఉపయోగంగా ఉంటోంది. అయితే ఫర్టిలిటీ మానిటరీ డిజిటల్ కిట్ ను నేరుగా వాడటం కన్నా గైనకాలజిస్ట్ సలహాతో వాడటం వల్ల ఎంతో మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

ఫర్టిలిటీ మానిటరీ డిజిటల్ కిట్ ను వాడటానికి ముందు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే.. ఆడవారిలో అల్ట్రా సౌండ్ సాయంతో ఓవలేషన్ అవుతుందా లేదా అని చూస్తారు. పాలిప్స్ లేదా గర్భ సంచి ముఖద్వారం దగ్గర ఏమైనా ఇష్యూలు ఉన్నాయా అని కూడా చెక్ చేస్తారు. అలాగే షుగర్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎలా ఉంది అని రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. అదే సమయంలో మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎలా ఉంది, వాటి మొటిలిటి ఎలా ఉంది అని కూడా చెక్ చేసి, ఏదైనా సలహా ఉంటే చెప్పడంతో పాటు మందులు అవసరమైతే వాటినీ ఇస్తారు.

రుతుక్రమాన్ని వాయిదా వేయడానికి ట్యాబ్లెట్లు వాడితే ఏమవుతుంది?
Last Updated : Mar 4, 2023, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details