10 రోజుల్లో బరువు తగ్గాలా? ఇవిగో 10 టిప్స్! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే!! Weight loss tips in telugu: వెయిట్ లాస్.. చాలా మంది కల. బరువు తగ్గి.. స్లిమ్‌గా, ఫిట్‌గా అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఉన్నపళంగా తిండి తినడం మానేసి కడుపు మాడ్చుకుంటారు. మరికొందరు జిమ్‌లో గంటల తరబడి గడుపుతూ తీవ్రంగా వ్యాయామాలు చేస్తుంటారు. రెండూ ప్రమాదకరమేనని అంటున్నారు నిపుణులు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుని, నిత్యం ప్రణాళికాబద్ధంగా వ్యాయామం చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. అందుకోసం వారు సూచిస్తున్న 10 సూత్రాలు మీకోసం..
Weight loss in 10 days home remedies:
1. ఊబకాయానికి ప్రధాన కారణాలు.. ఆహార అలవాట్లు, జీవనశైలి. ఈ రెండూ మార్చుకోవాలి. శరీరానికి పోషకాహారం అందేలా చూసుకుంటూ అవసరమైన వ్యాయామం చేయాలి.
2. Weight loss exercise: బరువు తగ్గాలంటే ఉదయం వ్యాయామంతో రోజును ప్రారంభించాలి. ఎక్సర్సైజ్ చాలా బ్రిస్క్‌గా ఉండాలి. గుండె, కండరాలు, ఎముకల దృఢత్వాన్ని పెంచేలా ఉండాలి. రోజుకు 40-60 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది. అందులోనూ రోజూ కనీసం 4 కిలోమీటర్లు వాకింగ్, మజిల్ బిల్డింగ్, బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడేలా కార్డియో ప్రొటెక్టివ్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి.
3. బరువు తగ్గాలని చాలా మంది ఉదయం అల్పాహారం తినడం మానేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసేవారి బరువు మరింత పెరుగుతుందని శాస్త్రీయంగా రుజువైంది. బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినడమే ఇందుకు కారణం. అలా శరీరంలోకి వచ్చిన అధిక కేలరీలు.. కొవ్వుగా మారతాయి.
4. Weight loss diet: మనం చేసే పనిని బట్టి.. కేలరీల ప్రకారం రోజూ ఆహారం తీసుకోవాలి. ఆహారం మితంగా, రోజుకు 5-6 సార్లు తీసుకోవడం ఉత్తమం.
5. ఆఫీస్‌కు, బయటకు వెళ్లేటప్పుడు అక్కడ దొరికే జంక్ ఫుడ్ తినకూడదు. ఇంటి నుంచే తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి.
6. ఆకలి వేసినప్పుడు వెంట తెచ్చుకున్న యాపిల్ తినడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే యాపిల్ తిన్నా ఆకలిగా అనిపిస్తే.. పాటలు పాడడం లేదా వినడం వంటివి చేయాలి.
7. ఆహారంతోపాటు నీరు సరైన మోతాదులో తాగడం ముఖ్యం. రోజుకు 3-4 లీటర్ల నీరు విడతల వారీగా తాగితే.. జీర్ణశక్తి, రక్త సరఫరా, శరీరం పనిచేసే తీరు మెరుగుపడతాయి.
8. నిత్యం ఏయే ఆహార పదార్థాలు తింటున్నామో కొన్నిరోజులు ఓ డైరీలో రాసుకోవాలి. ఎందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో లెక్క వేయాలి. ఈ వివరాలన్నీ ఇంటర్నెట్లో సులువుగానే దొరుకుతాయి. కేలరీలు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా అని సరిచూసుకోవాలి. అవసరమైన మార్పులు చేసుకోవాలి. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 1000 కేలరీలు సరిపోతాయి.
9. ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా.. చక్కెర, కొవ్వు, నూనె తక్కువగా ఉండేలా ఇంట్లో చేసుకున్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. గబగబా కాకుండా మెల్లగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నిండిన భావన కలిగి.. తక్కువగా తింటాం. మద్యం, కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్.. ఇవి ఎంత తాగుతున్నామో, ఎన్ని కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయో అవగాహన కలిగి ఉండాలి.
10. సరిపడా నిద్ర పోవాలి. రోజూ అదే పనిగా బరువు చూసుకోకూడదు. అలా చేస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం ఆలస్యమవుతుంది.