సంతానం ఎందరో దంపతుల కల. అయితే ఒకరిద్దరు పుట్టిన తర్వాత.. ఇక చాలని కొందరు భావిస్తారు. భవిష్యత్లో గర్భం దాల్చకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం శస్త్రచికిత్స కూడా చేయించుకుంటారు. ముఖ్యంగా మహిళలే ఎక్కువగా ఈ ఆపరేషన్ను(ట్యూబెక్టమీ, tubectomy operation) చేయించుకుంటారు. అయితే పురుషులు కూడా దీన్ని(వ్యాసక్టమీ,vasectomy operation) చేయించుకోవచ్చు. పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఈ శస్త్రచికిత్స మగవాళ్లు చేయించుకుంటే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు.
మహిళలకు ఇబ్బందులు
ట్యూబెక్టమీ.. మహిళల పొట్ట లోపలకు వెళ్లి చేయాలి. దీని వల్ల ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్(tubectomy problems) రావచ్చు. కొంతమందిలో ఈ ఇబ్బందులు తలెత్తుతాయి. పురుషుల్లో ఇలాంటి ఇబ్బందులు రావు.