తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ ఫుడ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? - తిన్నారంటే కొండంత బలం మీ సొంతం! - Healthy Foods

Superfood Combinations : ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది మంచి ఫుడ్. కానీ ప్రస్తుత రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడంతో పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్స్​ను తమ డైట్​లో చేర్చుకుంటే.. శరీరానికి పోషకాలు పొందడంతో పాటు మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Food Combinations
Food Combinations

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 4:19 PM IST

These Food Combinations Increase Health Benefits :మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే సరైన పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా మనం తీసుకునే ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆహారంలో ప్రొటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతులంగా ఉండేలా చూసుకోవాలి. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి, ఇతర కారణాలచేత సరైన టైమ్​లో ఫుడ్ తీసుకోవట్లేదు. దాంతో పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య నుంచి బయటపడాలంటే.. ఈ కాంబినేషన్​ ఫుడ్స్​ ట్రై చేయమంటున్నారు. ఇవి కలిపి తిన్నారంటే ఎనర్జీ లెవల్స్ పెరగడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

టమాటా - అవకాడో : మీరు టమాటాతో కలిపి ఏదైనా రుచికరమైన, ఆరోగ్యకరమైన కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. టమాటా అవకాడో కాంబినేషన్ సూపర్​గా ఉంటుంది. ఇది పోషకాహార పవర్​హౌస్ అని చెప్పుకోవచ్చు. అవకాడోలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు.. టమాటాలలోని యాంటీఆక్సిడెంట్ లైకోపీన్​ను నాలుగు రెట్లు శక్తివంతం చేస్తాయి. ఈ రెండు కలిపి తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్.. సలాడ్​లు, శాండ్​విచ్​ల రుచిని పెంచడమే కాకుండా కీలకమైన పోషకాలు లభిస్తాయి.

ఆపిల్ - డార్క్ చాక్లెట్ :ఇది కూడా కేవలం రుచిని పెంచడమే కాదు మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాపిల్‌లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్​, విటమిన్ సి ఉంటుంది. అలాగే డార్క్ చాక్లెట్​లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా పోరాడడంతో పాటు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఈ రెండింటిని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఈ కాంబినేషన్​ను టేస్ట్​ చేయాలంటే.. డార్క్ చాక్లెట్‌ను కరిగించి.. దానిని యాపిల్ ముక్కలపై పూసి తినాలి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. కనీసం 70% కోకో కంటెంట్‌తో కూడిన అధిక-నాణ్యత డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవాలి. అప్పుడే మీరు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

గ్రీన్ టీ - నిమ్మరసం :గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే చాలా మంది ఉదయం లేదా సాయంత్రం గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనికి మీరు కొన్ని చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకున్నారంటే గ్రీన్​ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. నిమ్మకాయలోని విటమిన్ సి గ్రీన్​ టీలోని కాటెచిన్​లను స్టెబిలైజ్ చేసి వాటి విచ్ఛిన్నాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చిక్ ​పీస్ - బీట్​రూట్​ : మీ ఎనర్జీ లెవల్స్ పెంచుకొని శక్తివంతంగా తయారుకావడానికి చిక్ పీస్ - బీట్​రూట్ కాంబినేషన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని కలిపి మీరు సలాడ్, సూప్ ఏది చేసుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. చిక్​ పీస్​లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇక బీట్​రూట్​లో మెగ్నీషియం, నైట్రేట్​లు ఉంటాయి. నైట్రేట్​లు నైట్రిక్ ఆక్సైడ్​గా మారి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ రెండింటిని కలిపి తినడం ద్వారా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు మంచి రుచికరమైన, హెల్దీ స్నాక్స్, సలాడ్స్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి. ఎన్నో పోషకాలు అందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

మీరు నాన్ వెజ్​ తినరా? ప్రొటీన్స్​ కోసం ఏం తీసుకోవాలో తెలుసా?

డిన్నర్​లో ఏం తింటున్నారు..? ఇవి తింటే డేంజర్​ జోన్​లో పడ్డట్టే!

ABOUT THE AUTHOR

...view details