సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచే చాలామందిలో తెలియకుండానే ఒత్తిడి, ఆందోళనలను పెంచేసింది. ఇప్పుడిక మూడో వేవ్ అంటున్నారు. అవి ఇంకాస్త పెరిగే ప్రమాదముంది. కాబట్టి, కొత్త సమస్యలు తెచ్చుకోకూడదంటే వీటికి చెక్ పెట్టేయాల్సిందే. ఇది ఆహారంతో సాధ్యమంటున్నారు నిపుణులు.
*గుమ్మడి గింజల్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంతో పాటు రక్తపోటునూ తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు, అరటిని తరచుగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు.
*ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్, విటమిన్ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి.
*డార్క్ చాక్లెట్‌లో థియోబ్రొమైన్ ఉంటుంది. ఇదీ యాంగ్జైటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పులిసిన పదార్థాలతో చేసే ఇడ్లీ, దోశ వంటివీ దీనికి చక్కని మందు.
*సిట్రస్ ఫలాలు సానుకూల ఆలోచనలనూ పెంచుతాయట. కామోమైల్ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఆత్రుతŸను తగ్గించే గుణాలుంటాయి. వీటినీ తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటుండాలి.
Depression: ఆందోళన తగ్గించే ఆహారం!
ఆహారంతోనూ ఆందోళన, ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలతో రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు.
ఆందోళన తగ్గించే ఆహారం!