Weight loss tips: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో సమస్యగా మారింది. పరిమితికి మించి భోజనం చేయడం, వేళకాని వేళ తినటం, చిరుతిళ్లు ఇందుకు కారణం కావచ్చు. వీటన్నింటితో పాటు మరో కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మనసులో కడుపునిండిన భావన కలగకుండా గబగబా తినడం వల్ల అధిక బరువు సమస్య వస్తుందంటున్నారు.
బరువు నియంత్రణకు ఆహార పాత్ర కీలకమైంది. అంతేకాదు. మనసులో కడుపునిండిన భావనతో తినడం బరువును తగ్గిస్తుంది. దీనినే 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటారు. అంటే తొందరగా తినకుండా ఆహారపదార్థాల రుచిని ఆస్వాదిస్తూ తినడం అన్నమాట. ఇలా తింటే ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ త్వరగా తినడం వల్ల కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది కానీ మనసుకు తృప్తి కలగదు. చిన్న భాగాలుగా ఆహారాన్ని తినడం వల్ల మనసుకు కడుపునిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.