Skipping Health Benefits In Telugu : చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గేందుకు చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కానీ వేగంగా బరువు తగ్గాలంటే ఏది ఉత్తమమైన వ్యాయామమో చాలా మందికి తెలియదు. ఒక్కో రకమైన ఎక్సర్సైజ్ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. కానీ అన్ని రకాల శరీరతత్వాలకు అత్యుత్తమంగా పనిచేసే వ్యాయామమే 'స్కిప్పింగ్'.
చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. చాలామంది నిపుణులు చెప్పేదేంటంటే స్కిప్పింగ్( Skipping Health Benefits ) అనేది అందరికీ అందుబాటులో ఉన్న అద్భుతమైన వ్యాయామం. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఒక రోప్, షూ ఉంటే చాలు. అయితే ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల మన శరీరంలోని అవయావాల పనితీరు కూడా మెరుగవుతుందని అంటున్నారు డాక్టర్లు.
కండరాల పటిష్ఠత..
Skipping Muscle Benefits : క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు అధిక స్థాయిలో ఖర్చవుతాయి. అదే సమయంలో కండరాలు కూడా పటిష్ఠడతాయి. కాళ్లు చేతులతో పాటు పూర్తి శరీరం కూడా కదలడం వల్ల శరీరాకృతి కూడా ఫిట్‌గా మారుతుంది.
హృదయం పదిలం..
Skipping Health Benefits : శరీర బరువును తగ్గించడమే కాకుండా గుండె కండరాలను కూడా స్కిప్పింగ్ దృఢంగా ఉంచుతుంది. స్కిప్పింగ్ చేసే సమయంలో జంపింగ్ వల్ల హార్ట్‌బీట్ రేట్, బ్రీతింగ్ రేట్లు పెరుగుతాయి. ఆ సమయంలో గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సాఫీగా సాగుతుంది.