కొత్త సౌందర్య ఉత్పత్తులను (new beauty products) ప్రయత్నించే ముందు మీ చర్మ తీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత కొనాలనుకునే ఉత్పత్తిలో వాడిన పదార్థాలేంటో చూసుకోవాలి. క్లెన్సర్, స్క్రబ్ వంటివి కడిగేస్తే సరిపోతాయి. కానీ సీరమ్, మాయిశ్చరైజర్ వంటివి చర్మంపై కొద్ది గంటలపాటు.. మళ్లీ ముఖం కడిగేంతవరకు ఉండిపోతాయి. కాబట్టి వీటి పట్ల మరింత జాగ్రత్త వహించాలి.
సౌందర్య ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అకర్షించే ప్రకటన లేదా స్నేహితుల నుంచి మంచి రివ్యూ.. అమ్మాయిలను కొత్త సొందర్య ఉత్పత్తులను (new beauty products) ప్రయత్నించేలా ప్రోత్సహిస్తుంటాయి. మరి అవి మీకు తగినవేనా? సరి చూసుకోవాలి. అదెలాగంటే..
సౌందర్య ఉత్పత్తులను వాడాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఫర్లేదు అనిపిస్తే ప్యాచ్ టెస్ట్ చేయాలి. అంటే కొద్ది మొత్తంలో క్రీమ్‌ను చేతికి రాసి, 24 గంటలపాటు అలాగే ఉంచాలి. దురద, ఎర్రదనం, దద్దుర్లు వంటివి లేకపోతే అప్పుడే ఉపయోగించాలి. స్కిన్ కేర్ రొటీన్‌ను సక్రమంగా అనుసరించడమూ ప్రధానమే. అలాగే సరైన ఫలితం రావాలనుకుంటే ప్రొడక్ట్‌పై ఉపయోగించమన్న తీరునీ పరిగణనలోకి తీసుకోవాలి.
ఇదీ చూడండి :మధుమేహం అదుపులో ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!