నెలసరి సరిగా రాకపోవడం, సంతానలేమి, జుట్టు రాలడం, దాంపత్య జీవితం పట్ల విముఖత.. ఇలా అనేక సమస్యలకు హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణం. అందుకే హార్మోన్ల గురించి అవగాహన పెంచుకుందాం..
ఇవీ లక్షణాలు
పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి.. ఈ రెండూ హార్మోన్ల అసమతుల్యతకు ముఖ్య కారణాలు. అయితే హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం.. లేకపోతే మందగించడం జరిగినప్పుడు సంతానలేమి, పీసీఓడీ, ఆందోళన, జననేంద్రియాల దగ్గర పొడిబారడం, దాంపత్య జీవితం పట్ల విముఖత, మూడ్‌స్వింగ్స్, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట, మొటిమలు, యాక్నె లాంటివి తలెత్తుతాయి.
ఎందుకిలా?
విటమిన్ డి3 తగ్గితే శరీరం హార్మోన్లని చురుగ్గా తయారుచేసుకోలేదు. సూక్ష్మపోషకాలైన జింక్, మెగ్నీషియమ్, సెలీనియమ్, బీ6 వంటివి తగ్గినా, ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం వల్ల కూడా కార్టిసాల్ హార్మోన్ విడుదల తగ్గి జీవక్రియలని చురుగ్గా ఉంచే హార్మోన్లు పుష్కలంగా విడుదలవుతాయి.
ఇవి తినాలి
సల్ఫర్ ఉండే క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌లను తీసుకుంటే కాలేయంలోని మలినాలు బయటకుపోతాయి, ఈస్ట్రోజెన్ పని తీరు బాగుంటుంది.