తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మల్లెచాయ్‌ మనసారా తాగేయాలోయ్!

మసాలా చాయ్, తందూరీ చాయ్ ఇలా ఎన్నో టీలు రుచి చూసి ఉంటారు. మరి ఎప్పుడైనా మల్లె చాయ్ తాగి చూశారా? అవును, మల్లెపూల చాయ్​తో అందం, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మరి ఆ విశేషాలేంటో చూసేద్దాం రండి...

know health benefits of jasmin tea
మల్లెచాయ్‌ మనసారా తాగేయాలోయ్!

By

Published : Aug 28, 2020, 10:31 AM IST

గ్రీన్‌టీతో పాటూ ఈ మధ్య పూల తేనీటీకీ ప్రాధాన్యం పెరుగుతోంది. వాటిల్లో మల్లెటీని తాగడం అలవాటు చేసుకుని చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

  • రోజూ ఉదయాన్నే ఓ కప్పు మల్లె టీ తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి ఇందులోని సుగుణాలు. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి.
  • రోజుకి కప్పు మల్లెటీ తాగడానికి ప్రయత్నించండి. వార్థక్యపు ఛాయలు తగ్గుతాయి. చర్మం మెరిసిపోతుంది.
  • కాలం ఏదైనా! జ్వరం, జలుబూ వంటివి అప్పుడప్పుడూ ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ టీ తాగి చూడండి. దీనిలోని యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వాటిని అదుపులో ఉంచుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిళ్లు ఓ కప్పు టీ తాగితే కలతల్లేని నిద్రతో పాటు తిన్న ఆహారమూ సులువుగా జీర్ణమైపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details