తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

లావుగా ఉన్న మహిళల్లో ఆ కోరికలు తక్కువగా ఉంటాయా? - లావు మహిళలు సెక్స్​ ఫీలింగ్స్​

శృంగారంపై ఎంతో మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. అయితే చాలా మంది లావుగా ఉన్న మహిళల్లో శృంగార కోరికలు తక్కువగా ఉంటాయని అనుకుంటారు. మరి దీనిపై నిపుణలు ఏం చెబుతున్నారంటే?

is-sex-less-in-obesity-woman-or-not
is-sex-less-in-obesity-woman-or-not

By

Published : May 29, 2022, 8:00 AM IST

సృష్టి మనకిచ్చిన అద్భుత వరాల్లో శృంగారం కూడా ఒకటి. ఆడ, మగ కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది. అయితే చాలా మందికి శృంగారానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుమానాలు, అపోహలు ఉంటాయి. చాలా మంది లావుగా ఉన్న మహిళల్లో శృంగార కోరికలు తక్కువగా ఉంటాయని అని అంటుంటారు. మరి దీనిలో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారంటే?

"లావుగా, సన్నగా ఉన్నా మహిళల్లో కామం ఒకేలా ఉంటుంది. కానీ అది వారి ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది సెక్స్​కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. మరికొంతమంది వేర్వేరు పనుల్లో బిజీ అయిపోతుంటారు. అంతేగానీ, లావు సన్నంలో తేడా ఏం లేదు.. కేవలం వారి ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా లావుగా ఉంటే మాత్రం కామం తక్కువగా ఉండే అవకాశం ఉంది. హార్మోన్ సమస్య ఎదురై వారిలో కామం కాస్త తగ్గుతుంది." అని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details