కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) చికిత్సలో వీర్యకణాలు చురుకుగా కదలటం, ఎక్కువసేపు జీవించి ఉండటం, ఫలదీకరణ సామర్థ్యం మెరుగ్గా ఉండటం కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గితే గర్భధారణ అవకాశాలూ సన్నగిల్లుతుంటాయి. అందుకే వీటిని పెంపొందించటానికి ఐఐటీ హైదరాబాద్, మంగళూరు యూనివర్సిటీ, కస్తూర్బా మెడికల్ కాలేజ్ పరిశోధకులు ఎంపీటీఎక్స్ అనే కొత్త మందును రూపొందించారు.
చురుకైన వీర్యకణాల కోసం కొత్త మందు..!
ఐవీఎఫ్ చికిత్స విజయవంతం కావాలంటే వీర్యకణాల పాత్ర చాలా కీలకం. వీటిని పెంపొందించటానికి ఐఐటీ హైదరాబాద్, మంగళూరు యూనివర్సిటీ, కస్తూర్బా మెడికల్ కాలేజ్ పరిశోధకులు సంయుక్తంగా ఎంపీటీఎక్స్ అనే కొత్త మందును రూపొందించారు.
చురుకైన వీర్యకణాల కోసం 'ఎంపీటీఎక్స్'
ఇది ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో వాడుతున్న పెంటాక్సిఫైలిన్ నుంచి పుట్టుకొచ్చిందే. కాకపోతే పిండం మీద ఎలాంటి దుష్ప్రభావాలు చూపకుండా, తక్కువ మొత్తంలోనే ఎక్కువ గుణం చూపిస్తుండటం విశేషం. స్కలనం ద్వారా వచ్చిన, వృషణాల నుంచి సేకరించిన వీర్యం రెండింటిలోనూ ఇది శుక్ర కణాల కదలికలను, జీవనకాలాన్ని పెంచుతున్నట్టు బయటపడింది. కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తున్న వారికిది బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:యుక్తవయసులో వ్యాయామం.. ఎన్నో లాభాలు!