తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా? - పక్షవాతం వస్తే సకాలంలో ఎలా స్పందించాలి

ఆ జబ్బు వస్తే ఎలాంటి మనిషైనా సెకన్లలో కుప్పకూలిపోతారు. సొంతంగా లేవలేరు. సకాలంలో వైద్యం చేయకపోతే ప్రమాదానికి దారితీస్తుంది. అదే పక్షవాతం. కానీ ఈ జబ్బును త్వరగా గుర్తిస్తే నయం చేసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు.

how to treat paralysis in time
how to treat paralysis in time

By

Published : Sep 10, 2022, 8:00 AM IST

Updated : Sep 10, 2022, 8:08 AM IST

How To Treat Paralysis : పక్షవాతం వస్తే ఎలాంటి మనిషైనా కుప్పకూలిపోవాల్సిందే. దీని బారిన పడిన తర్వాత శరీరంలో సగభాగం చచ్చుబడి పోతుంది. సొంతంగా లేవలేరు. ఏం మాట్లాడలేరు. అన్నం తినాలన్నా ఇబ్బందులే ఎదురవుతాయి. పక్షవాతం వస్తే సకాలంలో ఎలా స్పందించాలో వైద్యులు సూచిస్తున్నారు. తొలి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను కాపాడుకోవచ్చు. దీనిపై ప్రముఖ న్యూరోసర్జన్‌ నిపుణులు ఏమంటున్నారంటే..

  • బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని తెలిసినప్పుడు మాట తడబడుతుంది. ఒక కాలు, చేయి ఆడదు. చూపు మందగిస్తుంది. తలనొప్పి, వాంతులు కూడా అవుతాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
  • తొలి గంటలో వైద్యులకు చూపించగలిగితే పక్షవాతం నుంచి రక్షించుకోవడానికి సాధ్యం అవుతుంది.
  • పక్షవాతం లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగానే ఎమర్జెన్సీగా ఎంఆర్‌ఐ గానీ, సీటీస్కాన్‌ గానీ చేస్తారు.
  • ఇందులో ఎలాంటి స్ట్రోక్ వచ్చిందో తెలుసుకొని చికిత్స ప్రారంభిస్తారు. అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి రోగిని కాపాడడానికి అవకాశం ఉంటుంది.
Last Updated : Sep 10, 2022, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details