How to Solve Sexual Problems Between Wife and Husband :సంసారం హాయిగా సాగిపోవడంలో.. సెక్స్ పాత్ర ఎంతో కీలకం! అయితే.. మారిన జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి కారణాలతో.. ఎంతో మంది శృంగార రసాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో.. తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొందరు మందులు వాడుతుంటారు. మరికొందరు ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. వాటివల్ల సరైన ఫలితం లేకపోగా.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు ఆయుర్వేదాన్ని నమ్మితే.. మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అశ్వగంధ.. మనలో చాలా మంది అశ్వగంధ పేరు వినే ఉంటారు. ఆయుర్వేదంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. అయితే ఈ మూలిక వల్ల కలిగే లాభాల గురించి మాత్రం అంతగా తెలిసి ఉండదు. ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్య ఔషదం అని చెప్పుకోవచ్చు. మహిళల్లో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంతో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మూలిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడమే కాదు.. లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంతో పాటు.. స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శతవరి.. ఈ మూలికకు సైతం ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది. ఈ మూలికలో వంద వేర్ల బలం ఉంటుందని చెబుతారు. శతవరి అంటే 100 మంది పురుషుల బలం కలిగినది అని అర్థమట! ఈ మూలికను వాడడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయట. దీని ద్వారా హార్మోన్ల సమస్య తగ్గిపోతుందని.. మోనోపాజ్ సమస్య అంత త్వరగా వేధించదని అంటున్నారు.