ప్రతి ఒక్కరికీ యవ్వన ప్రాయంలో మొటిమలు రావడం సహజం. కొందరికి యవ్వన ప్రాయం ముగిసిన తర్వాత మొటిమలు (Acne Removal Remedies) ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఒత్తిడి, హార్మోన్ల స్థాయిలో మార్పులు, స్టెరాయిడ్లు వంటి మందులు ఉపయోగించడం కారణంగా మొటిమలు వచ్చే ఆవకాశాలున్నాయి. హార్మోన్లలో చోటుకు చేసుకొనే మార్పులు, చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి ఇందుకు ప్రధానకారణాలు. పీసీ ఒడి సమస్య, గర్భనిరోధక మాత్రలు వంటివి కూడా ఈ సమస్యకు కారణాలుగా నిలుస్తున్నాయి. అందాన్ని నాశనం చేసే మొటిమలను తొలగించేందుకు రకరకాల లోషన్లు, క్రీములు వాడుతుంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టి కాకుండా.. వ్యతిరేక విధానాలతో క్రీములు, లోషన్లు వాడడం వల్ల వాటిలోని రసాయనాలతో ప్రమాదముంది.
Acne Remedies: ముఖంపై మొటిమలా? ఈ చిట్కాలు మీకోసమే - మొటిమలు తగ్గించుకోవడానికి అనుసరించాల్సి మార్గాలు
మొటిమలు.. ముఖంపై ఇవి కనపడగానే యుక్తవయసు వచ్చింది అని గుర్తు చేస్తాయి. మారుతున్న జీవన విధానం వాతావరణ పరిస్థితుల కారణంగా చర్మంతో ప్రభావం చూపి వయసుతో నిమిత్తం లేకుండామొటిమలు (Acne Removal Remedies) వస్తున్నాయి. అందాన్ని నాశనం చేసే మొటిమలు తగ్గించుకోవడం ఎలా? అందుకు అనుసరించాల్సి మార్గాలు ఏంటి?
ముఖంపై మొటిమలు
మొటిమలు తగ్గించుకునే మార్గాలు..
- తరుచూ ఫేస్‌వాష్ చేసుకుంటూ ఉండాలి. కనీసం రోజులో రెండుసార్లు అయినా అలా చేయాలి.
- ఫేస్‌వాష్‌కు ఉపయోగించే క్రీములను వీలైనంత వరకు డాక్టర్ సలహాతో తీసుకుంటే ఉత్తమం.
- ఆయిల్ ఎక్కువగా ఉండే మాశ్చరైజర్స్ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
- తలకు పెట్టుకునే నూనెను ఎక్కువగా పెట్టుకోకూడదు. సరిపడినంత వరకు మాత్రమే పెట్టుకోవాలి.
- శరీరంలో ఎక్కువగా షుగర్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలను తగ్గించాలి.
- డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, చాక్లెట్స్ వంటి తీసుకోవడం తగ్గించాలి.
- జంక్ ఫుడ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాలి.
- పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసుకోవాలి.
- మొటిమలను తగ్గించుకోవడంలో తేనెది ప్రత్యేక పాత్ర. ఇందులో ఉండే యాంటి సెప్టిక్ గుణాలు తేమను అందించే కారకంగా పనిచేస్తాయి.
- నిమ్మరసాన్ని కూడా మొటిమలు తగ్గించే ఔషధంగా చెప్పవచ్చు. ఇది చర్మంలో దాగి ఉన్న దుమ్మూ, ధూళిలను తొలగించి శిబం గట్టిపడేలా చేస్తుంది.
- మనం తీసుకునే ఆహారంతో కూడా మొటిమలు తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా డైట్ ఫుడ్ తీసుకోవాలి. అందులోను ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఫ్యాట్, నూనె పదార్థాలు, మసాలాలు లేకుండా చూసుకోవాలి.
ఇదీ చూడండి:Chocolate Face Mask: చాక్లెట్.. మీ సౌందర్యానికి కూడా!