ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా పొట్టలో కొవ్వుపేరుకుపోయి(belly fat reduction ) ఊబకాయం రావడం బాగా పెరిగిపోతోంది. ఇలాంటి జీవనశైలి సమస్యల వల్ల దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నవారు ఎక్కువైపోతున్నారు. చాలామంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. వాటిని పాటించడంలో చేస్తున్న పొరపాట్ల వల్ల అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఎంత తింటున్నాం అనేదానితో పాటు.. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం(belly fat reduction diet) అనేది చాలా ముఖ్యం. తగినంత వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం(belly fat burning foods), ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప పొట్టలో కొవ్వు తగ్గదు. అసలు ఈ కొవ్వు తగ్గకపోవడానికి గల కారణాలు, తీసుకోవాలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వు ఉంటే అవి పొట్ట పెరగడానికి కారణమవుతాయి. అందువల్ల కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తింటూ.. మాంసాహారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. చేపలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఆహారం పరిమితంగా తీసుకుంటే కొవ్వు పెరగదు.
బీరు తాగడం కూడా పొట్ట పెరిగేందుకు కారణమవుతుంది(causes for belly fat). వాస్తవానికి బీరు ఒక్కటే కాకుండా.. ఆల్కహాల్‌తో కూడిన ఏ పానీయమైనా ఎక్కువ కేలరీలతో ఉండటం వల్ల సమస్య వస్తుంది.
మంచినీళ్లు తాగడం తగ్గించడం కూడా మంచిది కాదు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే.. అంత ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో.. ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగడం మరో రకమైన అనర్థం తెచ్చిపెడతాయి. తినే ఆహారం విషయంలోనూ, తాగే పానియాల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటే పొట్ట పెరిగే ప్రమాదం దాదాపుగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
"సాధారణంగా మనం బరువు పెరిగేటప్పుడు.. పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండె సంబధిత వ్యాధులు దరిచేరే అవకాశాలు ఎక్కువ. చాలా సందర్భాల్లో మన అలవాట్లే పొట్ట పెరిగేందుకు కారణం అవుతాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పొగ తాగడం. దీనివల్ల ఊపిరితిత్తులకు మాత్రమే సమస్య అనుకోవడం సరికాదు."