Muscle Gain Tips in Naturally:శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు. అయినప్పటికీ, సహజంగా కండరాల బరువు పెరగడం అంత తేలికైన పని కాదు. మరికొందరు త్వరగా కండలు రావడానికి ప్రొటీన్ సప్లిమెంట్లతోపాటు స్టెరాయిడ్స్ కూడా వాడతారు. దీంతో అనారోగ్యం బారిన పడుతుంటారు. ఇలా కాకుండా కేవలం సహజ పద్ధతుల ద్వారా కండలు పెంచుకోవచ్చని మీకు తెలుసా..? ఈ టిప్స్ ఫాలో అయితే ఎటువంటి సప్లిమెంట్లు వాడకుండానే మంచి ఫిజిక్‌ను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!
వెయిట్ లిఫ్టింగ్: కండరాలను పెంచడానికి ఇది ఉత్తమ మార్గం. కండరాల పెరుగుదలకు, మీరు కంపౌండ్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. కంపౌండ్ వ్యాయామాలు.. మీ కండరాలను మరింత సమర్థవంతంగా పెంచడానికి సహాయపడతాయి. కంపౌండ్ వ్యాయామాలకు కొన్ని ఉదాహరణలు స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ అండ్ ఓవర్‌హెడ్ ప్రెస్. అయితే కండలు పెంచుకోవడానికి.. ఒక్కసారే ఎక్కువ బరువులు ఎత్తకుండా.. ముందు చిన్న చిన్న బరువులను ఎత్తడం చేయాలి.
ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్: ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అంటే కాలక్రమేణా మీరు ఎత్తే బరువును క్రమంగా పెంచుకోవడం. ఇది పెరిగిన భారాన్ని నిర్వహించడానికి.. మీ కండరాల పనితీరును మెరుగుపరచడానికి, అలాగే ధృడంగా మారడానికి, కండరాలు బరువు పెరగడానికి సాయపడుతుంది. కాగా, ప్రతి వారం మీరు ఎత్తే బరువును 5 శాతం నుంచి 10శాతం వరకు పెంచుకోవచ్చు.
కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?
సరైన పోషకాహారం: కండరాల బరువు పెరగడానికి పోషకమైన ఆహారం కీలకం. కండరాలను బలంగా మార్చడానికి మీరు బర్న్ చేసే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవాలి. కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజు శరీర బరువు పౌండ్‌కు 1-1.5 గ్రాముల ప్రోటీన్‌ను తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతి భోజనంలో ప్రోటీన్‌తో పాటు పుష్కలమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి. ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
భోజనం చేసే సమయం: ఇది కూడా కండరాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. మీరు మీ వ్యాయామం పూర్తి చేసిన 30 నిమిషాలలోపు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనం తినడానికి ప్రయత్నించాలి. ఇది గ్లైకోజెన్‌ను తిరిగి నింపడానికి, కండరాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది.