చర్మ సంరక్షణ విషయంలో భారతీయులు ఓ రకంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు మనకు ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కీరా దోస, టొమాటో, క్యాప్సికమ్, బంగాళా దుంప వంటి కూరగాయలు తింటే కొందరికి పడవు. చర్మ సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకిలా జరుగుతుందో అర్థం కాదు. అలాంటప్పుడు చర్మ సంరక్షణకు సంబంధించి ఈ చిట్కాలు ఎంతో మేలు చేస్తాయి.
కనీసం 2 లీటర్ల నీరు తాగండి!
మన శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవాలి. అదే మన ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి జంక్ ఫుడ్స్, డెయిరీ ప్రొడక్ట్స్ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చర్మానికి జిడ్డుదనం కలిగించే ఆహార పదార్థాలకు వెనువెంటనే స్వస్తి పలికేయండి. ఇక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి.
చర్మానికి సన్ స్క్రీన్ రాసుకోకుండా ఇంటి నుంచి అసలు బయటికెళ్లొద్దు.