కొందరు తమ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకు కారణాలు ఏంటి? ఆ సమస్యను ఎలా అధిగమించాలి అంటే?
* ఒత్తిడి.. దీని ప్రభావం మొదట పడేది ముఖం (చర్మం) మీదే. ఆందోళన ఎక్కువైతే కార్టిసోల్ అదే పనిగా విడుదలై ప్రీమెచ్యూర్ ఏజింగ్‌కు కారణమవుతుంది. అధిక ఆందోళన, ఒత్తిడి వల్ల చర్మంపై గీతలు, ముడతలు త్వరగా వస్తాయి. యోగా, వ్యాయామం, నడక, స్నేహితులతో సరదగా గడపడం వంటివి చేయాలి.
* సబ్బు.. దీంట్లోని గాఢ రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను పీల్చేస్తాయి. దాంతో చర్మం నిర్జీవంగా మారి గీతలు, ముడతలు కనిపిస్తాయి. అప్పుడూ పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే తక్కువ గాఢత ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం తాజాగా ఉంటుంది.