'పురుషాంగం పెద్దగా ఉంటేనే మహిళ సంతృప్తి చెందుతుందా? సంభోగంలో విజేతలుగా నిలవాలంటే ఎంతసేపు సెక్స్ చేయాలి?' ఇవి పురుషులలో చాలా మందికి ఉండే అనుమానాలు! బెడ్‌పై విజృంభించాలని.. భాగస్వామికి మధురానుభూతి అందించాలన్న తపనతోనే ఈ అనుమానాలు వస్తుంటాయి. మరి, రతికేళిలో రాణించాలంటే పురుషాంగం సైజుకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అంగాన్ని పెంచుకునే మార్గాలు ఏవైనా ఉన్నాయా?
ముందుగా, రెండో అంశాన్ని పరిశీలిద్దాం. పురుషాంగాన్ని పెంచుకునేందుకు నిజానికి ఎలాంటి మార్గాలు లేవు. కొన్ని చికిత్సలు ఉన్నప్పటికీ.. వాటి వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
"పురుషాంగం పెరగడానికి ప్రత్యేకంగా ఎలాంటి మందులు గానీ, ఇంజక్షన్లు గానీ ఆపరేషన్లు కానీ లేవు. కొన్ని చికిత్సల్లో పురుషాంగాన్ని లాగి ప్లాస్టర్ వేసే పద్ధతి ఉంటుంది. కానీ, స్తంభించినపుడు మాత్రం ఎప్పటిలాగే అదే సైజులో ఉంటుంది. మామూలు సమయంలో పురుషాంగం పెద్దదిగా లేదని అనుకోకూడదు. అసలు మామూలు సమయంలో పురుషాంగం ఏ సైజులో ఉంటే ఏముంది? కాబట్టి, పురుషాంగం సైజు పెంచేందుకు ఎలాంటి సర్జరీలు అవసరం లేదు. అంగం స్తంభిస్తుందా లేదా అన్న విషయాన్నే పరిగణలోకి తీసుకోవాలి."
-డాక్టర్ సమరం