మన ముఖంతోపాటూ కళ్లూ అందంగా కనిపించాలంటే.. వాటి సంరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అదెలాగో తెలుసుకోండి మరి.
కళ్లు మిలమిలా మెరవాలంటే ఇలా చేయాలి! - etv bharat health
కళ్లతో ప్రపంచాన్ని చూస్తాం.. కానీ, ఆ కళ్లను పదిలంగా ఉంచుకోవడం మాత్రం మరచిపోతాం. క్షణం తీరిక లేకుండా మీకు దారి చూపించే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం. అలసిన నయనాల్లో ఉత్తేజాన్ని నింపేద్దాం రండి....
కళ్లు మిలమిలా మెరవాలంటే ఇలా చేయాలి!
చల్లని పచ్చిపాలల్లో దూదిని ముంచి కళ్ల చుట్టూ తుడుచుకోవాలి. అదే పాలల్లో మళ్లీ దూదిని ముంచి.. కళ్లపై పెట్టుకుని పది నిమిషాలయ్యాక తీసేయాలి. దీనివల్ల కనురెప్పలపై పేరుకున్న మురికిపోయి తాజాగా కనిపిస్తాయి. అలాగే చల్లని కీరదోస రసంలో దూదిని ముంచి కళ్లపై పెట్టుకున్నా కూడా మార్పు కనిపిస్తుంది.
- గ్రీన్‌టీలో మెత్తని వస్త్రాన్ని ముంచి.. పిండేసి కళ్లపై కప్పాలి. పదిహేను నిమిషాల తరవాత తీసేసి తుడిచేయాలి. కళ్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి. మిలమిలలాడతాయి.
- రోజంతా కంప్యూటరు ముందు కూర్చుని పనిచేయడం వల్ల.. కళ్లు అలసిపోయి, జీవం లేనట్టు కనిపిస్తాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఓ పని చేయండి. బాగా చల్లని నీళ్లను కళ్లపై చిలకరించుకోండి. ఇలా రోజులో నాలుగైదుసార్లు చేస్తుంటే కళ్ల అలసట తగ్గుతుంది.
- అతినీలలోహిత కిరణాలు కూడా కళ్లకు హాని చేస్తాయి. ఎండలోకి వెళ్తున్నప్పుడు చలువ కళ్లద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కళ్లు తాజాగా, ఆరోగ్యంగా కనిపించాలంటే.. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవడమూ ముఖ్యమే.
- కళ్ల చుట్టూ చర్మం వదులైనట్లు కనిపిస్తోందా.. తెల్లసొనను వాటి చుట్టూ రాసి, పదిహేను నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేయాలి. అక్కడి చర్మం బిగుతుగా మారుతుంది.
ఇదీ చదవండి: పది రోజుల్లో పొట్ట తగ్గించుకోండిలా..!