చాక్లెట్.. నోటిలో వేసుకోగానే కమ్మగా కరిగిపోతుంది. అలాంటి చాక్లెట్‌ను (Chocolate Face Mask) నిగనిగలాడే చర్మం పొందడానికి కూడా ఉపయోగించవచ్చు. కొన్నింటి మిశ్రమంతో చాక్లెట్‌ను కలిపి ముఖానికి పూసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం. అయితే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
Chocolate Face Mask: చాక్లెట్.. మీ సౌందర్యానికి కూడా! - చాక్లెట్‌తో అందం
తియ్యని చాక్లెట్ (Chocolate Face Mask) అంటే ఇష్టపడని వారెవరు ఉండరు! అయితే దీన్ని కేవలం తినడానికే కాదు... సౌందర్యపోషణకూ వినియోగించి అందంగా కనిపించవచ్చు. ఎలా అనేది తెలుసుకుందాం.
చాక్లెట్ తెచ్చే అందమిది
ముందుగా చాక్లెట్‌ను కరిగించాలి. దానిలో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, కాస్త నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పూత వేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో జిడ్డు తొలగి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.
- పావుకప్పు చాక్లెట్‌లో చెంచా తేనె, నాలుగు చెంచాల ఎప్సమ్ సాల్ట్ వేసి.. ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.
- ముఖం నిర్జీవంగా ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన చాక్లెట్‌లో చెంచా బాదం పేస్టు, కాస్త ఆలివ్ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని.. ముఖానికి రాసుకోవాలి. పావుగంట ఆరనిచ్చి వేళ్లను నీళ్లతో తడుపుతూ మర్దన చేయాలి. దీనివల్ల చర్మం శుభ్రపడుతుంది. కాంతిమంతంగా మెరిసిపోతుంది.
- సరైన పోషణ లేక కొన్నిసార్లు ముఖంపై ముడతలు పడి అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తాం. ఇలాంటప్పుడు చాక్లెట్ ద్రవంలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదారు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి బాగా గిలకొట్టండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే సమస్య దూరమవుతుంది.
ఇదీ చూడండి:ఒత్తయిన జుట్టు కావాలా? ఇవి తినండి!