ప్రస్తుత జీవన సరళిలో చాలా మందిని గ్యాస్ట్రబుల్ వేధిస్తోంది. ఈ సమస్యను కడుపులో పెద్ద వాయుగుండంగా భావిస్తుంటారు. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులి తేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. అస్తవ్యస్థమైన జీవనశైలి కారణాలు కావొచ్చు. ఈ క్రమంలో గ్యాస్ ట్రబుల్‌కు గల కారణాలు, దీని లక్షణాలతో పాటు ఈ సమస్య నుంచి బయటపడటానికి చిన్న చిట్కాను చూద్దాం.
కారణాలు
సమయానికి నిద్రపోకపోవడం, భోజనం చేయకపోవడం, కాఫీ, టీ, స్మోకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ గ్యాస్ ట్రబుల్ కనిపిస్తుంది. ఆకలి వేసినప్పుడు తినకపోవడం, ఆకలి వేయకపోయినా మళ్లీ మళ్లీ తినడం, కారం, మసాలాలు, నూనెతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
ప్రధాన కారణం
భయం, క్రోదం, దుఃఖం, ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి ప్రధాన కారణాలు.