Home Remedies To Reduce Period Pain : సాధారణంగా పీరియడ్స్ అంటేనే కొందరు మహిళలు భయపడుతూ ఉంటారు! ఆ సమయంలో వచ్చే నొప్పి, రక్తస్రావం, చికాకు, ఇతర సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో బాగా నీరసించిపోతారు. ఎటువంటి పనులు కూడా సరిగ్గా చేయలేక పోతుంటారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.
8 గంటల నిద్ర అవసరం
పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎనిమిది గంటల నిద్రపోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. "నెలసరి సమయంలో తక్కువగా నిద్రపోవడం వల్ల మరింత నొప్పికి కారణం కావొచ్చు. ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాల్సిందే" అని స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు కెల్లీ రాయ్ తెలిపారు.
పీచు పదార్థాలను తక్కువగా తీసుకోండి
Home Remedies For Period Stomach Pain : పీరియడ్స్ సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. పీరియడ్స్ సమయంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం పెరుగుతుందని చెప్పారు. సారా ట్యోగుడ్ అనే వైద్యురాలు చేపట్టిన అధ్యయనంలో నెలసరి సమయంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదని తేలింది.