Home Remedies for Dry Eyes in Telugu:ప్రపంచం మొత్తం డిజిటల్ మయమైంది. పిల్లల దగ్గర్నుంచీ పెద్దవాళ్ల వరకూ మొబైళ్లు, ల్యాప్టాప్లు, టీవీలకు అంకితమయ్యే పరిస్థితి వచ్చింది. వాటితోనే గంటలు గంటలు కాలక్షేపం చేస్తున్నారు. దీని ఫలితమే కళ్లు పొడిబారడం. చలికాలంలో ఈ ఇబ్బంది మరింత పెరిగి.. ఇతర సమస్యలకూ దారి తీయొచ్చు. మరి.. ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దాని లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ సమస్య ఎందుకు వస్తుంది?: కళ్లలో సరిపడా నీళ్లు ఉత్పత్తి కానప్పుడు ఈ సమస్య వస్తుంది. కంటి ఆరోగ్యంలో లాక్రిమల్ గ్రంథులది ప్రధాన పాత్ర. వీటి నుంచి ఉత్పత్తయ్యే లిక్విడ్స్ ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయి. రోజూ ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో ఈ లిక్విడ్స్ ఉత్పత్తి తగ్గిపోయి.. కళ్లు డ్రైగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
లక్షణాలు: కళ్లు మంటగా ఉండటం, తరచుగా దురద రావడం, ఎర్రగా మారడం, మసకగా కనిపించడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కళ్ల నుంచి నీళ్లు రాకపోవడం.. ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని చెప్పే లక్షణాలు. వీటిని మొదట్లోనే గుర్తించి.. జాగ్రత్త పడటం మంచిది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏఏ చిట్కాలు పాటించాలంటే..
మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!
- శుభ్రం చేయాలి:కళ్లు మంటలు పుడుతున్నాయంటే.. ముందు గోరువెచ్చని నీటిలో ముంచి పిండేసిన మెత్తటి వస్త్రంతో కళ్లను తుడిచి, కాసేపు వాటిపై అలానే ఉంచాలి. ఇలా పలుమార్లు చేస్తే సాంత్వన కలుగుతుంది. తద్వారా కళ్లు ఎర్రబడటం, మంట వంటివి తగ్గుతాయి.
- కొబ్బరినూనె: ఇది కంటికి తేమను అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. కొద్దిగా కాటన్ తీసుకుని కొబ్బరి నూనెతో తడిపి, కనురెప్పలపై పావుగంట ఉంచితే సరి. వేడి తగ్గి, చల్లదనం కలుగుతుంది. అయితే మరీ నూనె కారేలా తీసుకోవద్దు. రసాయనాలతో కూడినవి కాకుండా సేంద్రియ రకాలను ఎంచుకుంటే మేలు.