తెలంగాణ

telangana

గుండె జబ్బుకు ఇవీ సూచికలే!

By

Published : Dec 22, 2020, 2:25 PM IST

చేతి, కాలి వేలి గోళ్ల దిగువన లేక చర్మంపై ఎక్కడైనా పసుపు, నారింజ రంగులో దద్దుల్లాంటివి వస్తున్నాయా? అయితే అప్రమత్తమవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు. చర్మ సమస్యగా భావించే ఈ దద్దులు దీర్ఘకాలంలో వచ్చే గుండె జబ్బులకు సంకేతం అంటున్నారు.

sukhibava
దద్దులే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే..

శరీర పై భాగంలో ఎక్కడైనా పసుపు, నారింజ రంగులో దద్దుల్లాంటివి వస్తోంటే జాగ్రత్త పడాలని సర్వేలు సూచిస్తున్నాయి. మనలో చాలామంది చర్మ సమస్యగా అనుకుని నిర్లక్ష్యం చేసే ఈ దద్దులు గుండెజబ్బుకు సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె జబ్బులకు ఆస్కారం...

శరీరంలో ట్రైగ్లిజరైడ్ల మోతాదులు బాగా పెరిగిపోతే ఇలా చర్మం మీద చిన్న చిన్న పొక్కులు, గుల్లల వంటివి ఏర్పడతాయి. ట్రైగ్లిజరైడ్లు గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయి. శరీరంలో వీటి స్థాయులు శ్రుతిమించితే రక్తనాళాలు గట్టిపడే ప్రమాదముంది. పిడికిలి బిగువు తగ్గటమూ గుండెజబ్బు ముప్పును సూచనల్లో ఒకటి. దెబ్బలేమీ తగలకపోయినా అకారణంగా గోళ్ల కింద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడటమూ ప్రమాదకరమైనదే. ఇవి గుండె కవాట పొర ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం కావొచ్చు.

ఇదీ చదవండి:భారత్​లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం!

ABOUT THE AUTHOR

...view details