Heart Problems in Winter: వణికించే చలితో చర్మం పొడిబారటం వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయనుకుంటే పొరపాటే! ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా ఈ చలికాలంలో ముదురుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవటానికీ, గుండె జబ్బులకీ మధ్య సంబంధం ఉందని స్వీడన్‌లోని లండ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు ఇటీవలే మరోసారి నిరూపించారు. ముఖ్యంగా చలికాలంలో.. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తగ్గినప్పుడు ఈ ముప్పు మరింతగా పెరుగుతోందని వీరు నిర్ధారణకు వచ్చారు. ఇలా ఉష్ణోగ్రతలు సున్నా కంటే కిందికి పడిపోయినప్పుడు.. ఒక్క రోజులోనే గుండెపోటు వచ్చే ముప్పు నాలుగు రెట్లు పెరుగుతోంది.
Heart Problems in Winter: చలికాలంలో అలా జరిగితే గుండెపోటు!
Heart Problems in Winter: శీతాకాలంలో చలి వల్ల జలుబు, జ్వరాల్లాంటి తేలికపాటి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు.. ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా వస్తాయి! ఉష్ణోగ్రతలు సున్నా కంటే కిందికి పడిపోయినప్పుడు.. ఒక్క రోజులోనే గుండెపోటు వచ్చే ముప్పు నాలుగు రెట్లు అధికమవుతోందని మరోసారి తేల్చారు పరిశోధకులు.
సూర్మరశ్మి తక్కువగా ఉండటం, చల్లగాలులు తీవ్రంగా వీచటం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం.. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరంలో ఉష్ణోగ్రతను నెగ్గుకొచ్చే శక్తి తగ్గిపోయి.. ఆ ప్రభావం నేరుగా ఒంట్లోని అవయవాల మీద పడుతోంది. (థర్మల్ కండక్షన్). దీంతో రక్తనాళాలు చలికి ప్రతిస్పందించి.. ధమనుల్లో రక్తపోటు పెరిగిపోయి.. తీవ్రమైన వణుకు, గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటోందని గుర్తించారు. కాబట్టి గుండె సమస్యలున్నవాళ్లు ఈ చలికాలంలో.. నేరుగా చలిలోకి వెళ్లకుండా కాస్త వెచ్చటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించటం ఉత్తమం!
ఇదీ చూడండి:'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!'