Breakfast Combinations for Weight Loss:ప్రస్తుత రోజుల్లో అధిక బరువు ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి కారణాలు అంటే.. ఒక్కటని ఏమి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే వెయిట్ తగ్గడం కోసం చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గేడమే లక్ష్యంగా చాలా మంది కష్టపడుతుంటారు. చివరకు ఆశించిన ఫలితం రాక బాధపడతారు. అలాంటి వారు ఇకపై టెన్షన్ పడనవసరం లేదు. మనం డైలీ తినే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ కాంబినేషన్ ఫుడ్స్ ట్రై చేయమంటున్నారు నిపుణులు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఓట్స్ విత్ పెరుగు:ఓట్స్‌ను చాలా మంది డైలీ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకుంటారు. అయితే ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఇందులోని అధిక ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ఇది అతిగా తినడం, బరువు పెరుగుటకు దారితీసే స్నాక్స్‌పై ఆసక్తిని తగ్గిస్తుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఈ రెండింటిని కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అదనపు రుచి కావాలంటే.. బెర్రీలను ఇందులో కలుపుకుని తినవచ్చు. బెర్రీల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి.
నెల రోజులు గుడ్లు తినడం మానేస్తే - మీ బాడీలో జరిగేది ఇదే!
పోహా, మొలకలు:పోహాను తినడం వలన వెయిట్ లాస్ కావచ్చంటున్నారు నిపుణులు. పోహాలో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా జీర్ణమవుతుంది. పోహా తినడం వలన మీ గట్ హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. పోహాలో మొలకలు కలిపి తింటే ఈజీగా వెయిట్‌లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే.. మొలకల్లో ప్రోటీన్, విటమిన్లు ఉన్నాయి.
చట్నీ-సాంబార్‌తో ఇడ్లీ:చాలా మంది సాంబార్ ఇడ్లీని తమ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటారు. ఇడ్లీలు ఆవిరిలో వండుతారు. అలాగే ఇవి తక్కువ కొవ్వు, కేలరీలను కలిగి ఉంటాయి. ఇక సాంబార్‌ను పప్పు, కూరగాయలతో తయారు చేస్తారు. కాబట్టి.. అందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ రెండు కూడా బరువు తగ్గడానికి సాయపడతాయి..