శనగల్లో(సెనగలు) పోషకాలు నిండుగా ఉంటాయి... పైగా రుచిగానూ ఉంటాయి. మరి, శనగలతో ఏం లాభాలున్నాయో ఓ లుక్కేయండి...
ఉత్తమ టిఫిన్..
మిగతా పప్పుగింజలతో పోలిస్తే సెనగల నుంచి అధిక మొత్తంలో మాంసకృత్తులు లభిస్తాయి. ఇవి ఆహారాన్ని నిదానంగా జీర్ణమయ్యేలా చేసి పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని అల్పాహారంగా తీసుకోవచ్చు.
వీటితో కలిపితే..
సెనగలను బియ్యం, గోధుమలు... ఇలా ఇతర ధాన్యాలతో కలిపి తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి.
తిని నీళ్లు తాగితేనే..
వీటిలో పీచు ఎక్కువ. అందుకే సెనగలను క్రమం తప్పకుండా తీసుకునేవారిలో మలబద్ధకం సమస్య ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకపోతే సెనగలు తిని నీళ్లు కూడా బాగా తాగినప్పుడే ఈ ఫలితం కనిపిస్తుంది. వీటిలోని పీచు పేగుల ఆరోగ్యాన్ని కాపాడి కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అలాగే పీచు రక్తంలో చక్కెర స్థాయులను కూడా బాగా నియంత్రిస్తుంది.