Green Chilli Health Benefits In Telugu : పచ్చి మిర్చి.. భారతీయ వంటింట్లో దీనికున్న ప్రత్యేకత వేరు. మన ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలోనే తినే పదార్థాల్లో మిర్చిని ఎక్కువగా వాడతారు. కూరలు మొదలు దాదాపు అన్నింట్లో దీన్ని ఉపయోగిస్తారు. స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు కానీ, సాయంత్రం కుటుంబసభ్యులతో కానీ ఉన్నప్పుడు తినే బజ్జీలు, సమోసా లాంటి వాటిల్లో మిర్చి ఉండి తీరాల్సిందే. అంతేకాకుండా.. దీని పేరుతో చిల్లీ చికెన్ లాంటి ప్రత్యేకమైన వంటకాలున్నాయంటే మిర్చి క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిర్చి ఒక ఆహార పదార్థమే కాకుండా.. ఇది మన వంటకాలకు ఒక స్పైసీనెస్ను జోడిస్తుంది. దీన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. పచ్చి మిర్చి.. వయసు తక్కువగా కనబడేందుకు తోడ్పడుతుంది. మిర్చిలను మన డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
1. విటమిన్ రిచ్ ఐటెమ్
Vitamins In Green Chilli : మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిల్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ఏ ఇందులో ఉంది.
2. జీవక్రియను పెంచుతాయి
Green Chillies Increase Metabolism :మిర్చిల్లో కాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిల్లో కారంమంట ఉండడానికి కారణమిదే. అయితే.. ఇది మన జీవక్రియను తాత్కాలికంగా బూస్ట్ చేస్తుంది. పైగా ఎక్కువ క్యాలరీలు కరిగేందుకు సాయపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది.
3.నొప్పి నివారిణి
Green Chilli Pain Relief Benefits : పచ్చిమిర్చి.. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాల నొప్పి, అర్థరైటిస్ చికిత్సల్లో ఉపయోగించే కొన్ని క్రీముల్లో దీన్ని వినియోగిస్తారు.