తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మృతకణాలు పోయి ముఖం అందంగా మారాలా? ఈ స్క్రబ్బర్స్​తో ప్రాబ్లం సాల్వ్​! - dead skin cells removing tips in telugu

Face Scrubs for Glowing Skin: కాలుష్యం కారణంగా.. చర్మంపై మలినాలు, మృతకణాలు పేరుకుంటాయి. దీని కారణంగా.. అందం దెబ్బతింటుంది. మీ చర్మం తిరిగి మెరవాలంటే.. స్క్రబ్బింగ్‌ బెస్ట్‌ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. సింపుల్​గా ఇంటి కిచెన్​లో దొరికే వాటితోనే ఈ సమస్య నుంచి బయటపడి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

Face Scrubs for Glowing Skin
Face Scrubs for Glowing Skin

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 1:41 PM IST

Face Scrubs for Glowing Skin: మహిళలు తమ ముఖం అందంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా చర్మంపై మృతకణాలు ఏర్పడతాయి. వీటి వల్ల మళ్లీ మొటిమలు, మచ్చలు, టాన్‌ పట్టేయడం వంటివి జరుగుతాయి. ఇవి ముఖాన్ని, చర్మాన్ని కాంతివిహీనంగా మారుస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతారు. అయితే​ చర్మ కాంతిని కాపాడుకోవడానికి, మృతకణాలు తొలగించడానికి, మచ్చల నుంచి ఉపశమనం లభించడానికి స్క్రబింగ్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే.. స్క్రబ్బింగ్‌ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..​

తేనె:హనీలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇందులో నియాసిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్‌, పొటాషియం, జింక్​ తదితర మినరల్స్ ఉన్నాయి. అంతేగాక తేనెలో కార్బోహైడ్రేట్స్​ కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సాయంతో ముఖానికి మెరుపు సంతరించుకుంటుంది.

మిరియాలు- ఘాటైన రుచే కాదు, గమ్మత్తైన హెల్త్ బెనిఫిట్స్​ కూడా! మిస్​ అయ్యారంటే అంతే!

ఫేస్​ప్యాక్​ ఎలా చేయాలంటే: నాలుగు చిన్న అవకాడో ముక్కలు తీసుకుని మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమానికి ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత సున్నితంగా స్క్రబ్‌ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మృతకణాలు తొలగి చర్మం తాజాగా ఉంటుంది.

అరటిపండు:ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 , ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, బి6 చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తాయి. అరటిపండ్లలో ఉండే.. పొటాషియం, మాంగనీస్ సమృద్ధిగా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

ఎలా తయారు చేయాలంటే: ఈ స్క్రబ్‌ తయారు చేసుకోవడానికి ఒక అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోండి. దీనిలో రెండు చెంచాల బాదం పేస్ట్‌ మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నుంచి 15 పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత సున్నితంగా స్క్రబ్‌ చేయండి. ఆ తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకోండి. అరటిపండు.. చర్మానికి తేమనందిస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం నిగారింపు వస్తుంది.

కీరదోస:కీరదోసలో ఉండే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు చర్మానికి చల్లదనం ఇస్తాయి. కీరాకి చర్మ రంధ్రాలని బిగుతుగా చేసి , నూనె ఉత్పత్తిని తగ్గించే గుణం ఉంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి. కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలని కూడా కీరా తగ్గిస్తుంది. నిద్ర లేచిన వెంటనే మొహం ఉబ్బినట్టు కనిపిస్తే కీరాతో రుద్దితే ఫలితం ఉంటుంది.

వింటర్​లో కర్లీ హెయిర్ సంరక్షణ - ఇలా చేస్తేనే స్టైల్​గా ఉంటుంది!

ఈ స్క్రబ్​ కోసం: కీరదోస రసంలో కొద్దిగా వంటసోడా మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. సున్నితంగా స్క్రబ్‌ చేసుకోండి. కీరా.. చర్మం మీది మలినాలు, మృతకణాలు తొలగించి.. మెరుపు తీసుకొస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగవుతుంది.

నిమ్మరసం: ముఖ అందాన్ని పెంచేందుకు నిమ్మకాయ మంచి ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసంతో సన్‌ట్యాన్, ముడతలు కూడా తొలగిపోతాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకు నిమ్మరసం చాలా లాభదాయకం. నిమ్మరసం ముఖానికి రాసుకోవడం వల్ల పింపుల్స్, యాక్నే సమస్య దూరమౌతుంది. నిమ్మలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై యాక్నే, పింపుల్స్ సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా నిమ్మరసంతో కొబ్బరి నూనె లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి రాస్తే పింపుల్స్, యాక్నే దూరమౌతాయి. అయితే నిమ్మకాయను ఎప్పుడూ ముఖంపై నేరుగా రాయకూడదు. దీనివల్ల చాలా దుష్పరిణామాలుంటాయి.

చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ ట్రై చేయండి!

ఎలాగంటే: టేబుల్‌ స్పూన్‌ బ్రౌన్‌షుగర్‌లో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ట్యాన్‌ తొలగిపోతుంది. నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

​​గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

పెడిక్యూర్​ కోసం పార్లర్​కు వెళ్తున్నారా? - పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోని పాదాల అందం పెంచుకోండి!

ABOUT THE AUTHOR

...view details