తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీరు వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారా... అయితే జరభద్రం!

మీరు ఇంటి నుంచి పని చేస్తున్నారా... అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకని ఆలోచిస్తున్నారా... అయితే ఈ కథనంపై ఓసారి లూక్కేయండి.

Experts say that work from home can increase stress
మీరు వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారా... అయితే జరభద్రం!

By

Published : Jun 4, 2020, 3:24 PM IST

ఇంటి నుంచి పనిచేయడం వల్ల టైమ్‌ చేతుల్లో ఉంటుంది అనుకుంటారు కానీ అది ఒట్టి అపోహే అంటున్నారు మానసిక విశ్లేషకులు. దీనివల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతుందట. కొలీగ్స్‌ లేదా అధికారులతో సమావేశాల్లో పాల్గొంటే- నేరుగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఉండే సౌలభ్యం ఫోను లేదా వీడియో కాల్స్‌లో ఉండదు. వీటిల్లో ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది.

వీడియోకాల్స్‌లో ఎక్కువసేపు ముఖంలోకి చూస్తూ మాట్లాడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో ఆందోళన పెరుగుతుంది. తప్పనిసరై ఇంటి నుంచి పని చేసేటప్పుడు- ఆఫీసు వేళల్లోనే పనిచేయాలట. అలాకాకుండా పన్నెండు గంటలపైనే పనితోనే కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పని సరిగ్గా సాగదనీ, దాంతో ఫలితం ఉండదనీ చెబుతున్నారు.

ఇదీ చూడండి:వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ABOUT THE AUTHOR

...view details