సెక్స్‌పై ఆసక్తి పూర్తిగా తగ్గడం అనేది ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది మగవారిలోనైనా, ఆడవారిలోనైనా సరే. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత హార్మోన్స్ తగ్గడం ద్వారా మనిషి సెక్స్‌లో పాల్గొనలేకపోవచ్చేమో కానీ ఆ సెక్సువల్ థాట్స్ మాత్రం ఉంటాయని చెప్తున్నారు.
శృంగారం పట్ల ఆసక్తి తగ్గకపోవడానికి మరో కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్స్ అని నిపుణులు పేర్కొన్నారు.
మానసికంగా నియంత్రించుకుంటే తప్ప ఆ ఆసక్తి అనేది తగ్గదని తెలిపారు. 'సెక్స్ వల్ల కలిగే అనుభూతిని పొందాలని అనుకునే వారు నెల లేదా రెండునెలలకు ఓసారైనా సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.' అని పేర్కొన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు రోజుకు మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటారని.. ఆ తర్వాత అది క్రమంగా తగ్గుతూ వస్తుందని తెలిపారు. వృత్తి, వ్యాపారాల కారణంగా వచ్చే ఒత్తిడి కూడా సెక్స్‌పై ఉన్న ఆసక్తి తగ్గడంలో ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు.
ఇదీ చూడండి :భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మేలు?